అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిరసనకారులకు బెయిల్ ..! 14 h ago
TG : రేవతి, శ్రీతేజ కుటుంబానికి న్యాయం చేయడంలో సినీ నటుడు అల్లు అర్జున్ విఫలమయ్యారని ఓయూ జేఏసీ నాయకులు అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిరసన కారులు ఆయన ఇంటి ఆవరణలో పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఇందుకు ఈ దాడిపై వెంటనే స్పందించిన పోలీసులు ఆరుగురు జేఏసీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన వారిని రెడ్డి శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేష్, ప్రేమ్ కుమార్, ప్రకాష్ గా గుర్తించారు. సోమవారం తెల్లవారుజామున నిందితులను కోర్టులో హాజరు పరిచారు. ఆరుగురికి జడ్జీ బెయిల్ మంజూరు చేశారు.